19, ఏప్రిల్ 2013, శుక్రవారం

గుండ్యాల్ (Gundyal)

 
 గుండ్యాల్
గ్రామముగుండ్యాల్
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5001 (2001)
6126 (2011)
గుండ్యాల్ మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 5001. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 23 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 535 హెక్టార్ల అటవీప్రాంతం ఉంది. గ్రామంలో పురాతనమైన శ్రీవెంకటేశ్వరాలయం ఉంది. ఆమజనేయస్వామి ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
గుండ్యాల్ గ్రామం హన్వాడ మండలంలో పశ్చిమ భాగంలో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, దక్షిణమున కోయిలకొండ మండలములు సరిహద్దులుగాఉండగా, తూర్పున ఈ మండలమునకు చెందిన మునిమోక్షం, దోరసముద్రం గ్రామాలు, పశ్చిమాన వేపూర్, నైరుతిన అయోద్యనగర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 5001. ఇందులో పురుషులు 2513, మహిళలు 2488. ఇదిమండలంలో రెండోపెద్ద గ్రామము.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6126. ఇందులో పురుషులు 3049, మహిళలు 3077. గృహాల సంఖ్య 1224, అక్షరాస్యత శాతం 36.6%. గ్రామ కోడ్ సంఖ్య 575055.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 110 ఓట్లు ఆధిక్యత లభించింది.

విద్యాసంస్థలు
గ్రామంలో ప్రాథమిక పాఠశాల, జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి. గుండ్యాల్ గేట్ వద్ద మరో ప్రాథమిక పాఠశాల ఉంది. లింగన్ పల్లి, పచ్చర్ల తండా, కిష్టంపల్లి, అత్యాకుంట తండా, కిష్టంపల్లి గేట్ తండా, ఎర్రగుట్ట తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి