14, ఏప్రిల్ 2013, ఆదివారం

కసిరెడ్డి వెంకటరెడ్డి (Kasireddy Venkat Reddy)

ప్రముఖ కవి కసిరెడ్డి వెంకటరెడ్డి 1946లోమహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలం పోలెపల్లి గ్రామంలో జన్మించారు. కవిగా, రచయితగా, జానపద పరిశోధకుడిగా, సామాజిక ధార్మిక వ్యాఖ్యాతగా రసిద్ధి చెందారు. కల్వకుర్తిలో హైస్కూలు విద్య, పాలెం ప్రాచ్యకళాశాలలో డిఓఎల్ పూర్తిచేశారు. తెలుగు మరియు సంస్కృతం భాషలలో ఎం.ఏ.పట్టా పొందారు. 1982లో "తెలుగు పొడుపు కథలు" అంశంపై పీహెచ్‌డి డిగ్రీ పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనేక పుస్తకాలను రచించారు. "చైతన్య శ్రీ" కావ్యానికి రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. వీరి వ్యాసాలు, కథలు అనేక దినపత్రికలలో ప్రచురితమైనాయి. సాహితీసేవకుగాను ఈయన పలు పురస్కారాలు కూడా అందుకున్నారు.


విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలుఆమనగల్లు మండలము,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి