14, ఏప్రిల్ 2013, ఆదివారం

నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ (Nagarkurnool Revenue Division)

మహబూబ్ నగర్ జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్ ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ క్రింద 13 మండలాలు, 283 రెవెన్యూ గ్రామాలు, 230 గ్రామపంచాయతీలు కలవు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ జనాభా 6,68,044. ఈ డివిజన్ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. డివిజన్ పరిధిలో 2 పురపాలక సంఘాలున్నాయి. మండలాల సంఖ్యలోనూ, జనాభాలోనూ ఈ డివిజన్ 3వ స్థానంలో ఉన్నది. 
డివిజన్ పరిధిలోని మండలాలు
1.అచ్చంపేట6.టెల్కపల్లి11.బల్మూరు
2.అమ్రాబాదు7.తాడూరు12.బిజినేపల్లి
3.ఉప్పునూతల8.తిమ్మాజిపేట13.లింగాల్
4.కొల్లాపూర్9.నాగర్‌కర్నూల్
5.కోడేరు10.పెద్దకొత్తపల్లి

జనాభా:
2011 లెక్కల ప్రకారం గద్వాల డివిజన్ జనాభా 6,68,044. ఇందులో పట్టణ జనాభా 59,593, గ్రామీణ జనాభా 6,08,451. అచ్చంపేట మరియు నాగర్‌కర్నూల్ పట్టణప్రాంతాలుగా ఉన్నాయి.

నియోజకవర్గాలు
ఈ రెవెన్యూ డివిజన్ పరిధి 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. లోకసభ నియోజకవర్గం మాత్రం ఒక్కటే.

అసెంబ్లీ నియోజకవర్గాలు లోకసభ నియోజకవర్గాలు
  • అచ్చంపేట (3 మండలాలు}
  • కొల్లాపూర్ (5 మండలాలు) 
  • నాగర్‌కర్నూల్ (5 మండలాలు) 
  • నాగర్ కర్నూల్ (13 మండలాలు)

విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్లు,  నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్,   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి