13, ఫిబ్రవరి 2013, బుధవారం

కోయిలకొండ కోట (Koilkonda Fort)

కోయిలకొండ కోట
ఆంద్రరాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో కోయిలకొండ కోట ఒకటి. ఇది కోయిలకొండ మండలకేంద్రంలో మహబూబ్ నగర్ నుంచి 20 కిమీ దూరంలో ఉన్నది. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది. కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్టగా పిలుస్తారు. కొందరు దురభిమానులు కోటలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు కలవు.ఒకనాడు తాలుకా కేంద్రంగా విరజిల్లిన ఈ కోట నేడు మండల కేంద్రంగా తన ఉనికిని చాటుకుంటుంది. కోట సప్తప్రాకారాలతో, నాలుగు ద్వారాలతో లెక్కకు మించిన బురుజులతో శత్రు ప్రవేశం జరగని విధంగా నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్ళను ఒక దానిపై మరొక దాన్ని పేర్చి గోడల నిర్మాణం చేశారు. గచ్చు గానీ, మట్టి గానీ వాడకుండానే గోడల నిర్మాణం చేయడం మహాద్భుతం. కోటపైకి ఎక్కడానికి విశాలమైన మెట్లను నిర్మించారు. కోటలో రెండంతస్తుల దివ్యమైన రాణి మహల్‌ ఉంది. అది నేటికి అక్కడ కనిపిస్తుంది. కోటపై భాగంలో సంవత్సరం పొడవునా తాగునీటి ఎద్దడి లేకుండా విశాలమైన సరోవరములను నిర్మించారు. ఆ నాటి రాజులు తమ సౌకర్యార్ధం అశ్వశాలలు, గజశాలలు, ధాన్యాగారాలు, నివాస గృహాలు కోటపై భాగముననే నిర్మించారు. రాజు వినియోగానికి నీటి గది ఒకటి రమణీయంగా నిర్మించుకోవడం జరిగింది. ఆ గదిలోనికి వీరు మాత్రం ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు. నీళ్ళు మాత్రం సూచికగా కనబడతాయి. కోటపై భాగంలో ఆంజనేయస్వామి దేవాలయంతో పాటు అడుగడుగున అనేక దేవాలయాలు తారసపడతాయి.

కోట చరిత్ర
కోయిలకొండ కోటను వడ్డె రాజులు నిర్మించారు. కాల క్రమంలో కోట వెలమరాజుల (పద్మనాయక రాజుల) వశమైంది. ఈ కోటను పరిపాలించిన చివరి వెలమ రాజు సవాయిబసవరాజు. అతడు గోల్కొండ కుత్‌బ్‌షాహి వంశ మూల పురుషుడు మహ్మద్‌ కులీకుత్‌బ్‌షాకు సమకాలికుడు. కోయిలకొండ కోట రాజు సవాయి బసవరాజు కాగా, సేనాధిపతి యాదవరావు, కోశాధికిరగా పురుషోత్తంరావు పని చేశారు. కోయిలకొండ రాజ్యం చాలా విస్తీర్ణం కలిగి ఇప్పటి చించోళి వరకు వ్యాపించి ఉండేది. యాదవరావు తన గుర్తుగా కోట కింద ప్రాంతం గల గ్రామాన్ని పేట అని పిలిపిచే వారు. ఈ పేటలోని ప్రజలకు తాగునీటి కోసమై చేదబావిని త్రవ్వించాడు. గంభీరరావు తన జ్ఞాపకార్ధకంగా గంభీరోని చెరువు తవ్వించాడు. గోల్కొండ నవాబు కోయిలకొండను ఆక్రమించాలని కోయిలకొండ రాజుపై దండెత్తారు. కోట పేటలో భీకరమైన యుద్దం జరిగి వేలాది మంది మృత్యువు పాలయ్యారు. అనంతరం హిందూ, ముస్లింల పెద్దలు అందరు ఐక్యతతో ఉండాలని కోటపై భాగంలో ఒక శిలా శాసనాన్ని రాయించారు.

చూడదగ్గ ప్రదేశాలు
కోటలో నిర్మించిన అద్భుత కట్టడాలైన గోడలు, సరస్సులు, ధాన్యారాగాలు, దేవాలయాలు, రెండు పెద్ద పిరంగులతో పాటు కోట చుట్టూ గల కొండలపై అలనాడే మహిమ గల దేవాలయాల నిర్మించారు. కోటకు పడమటి భాగాన రామగిరి అని నాడు రామకొండ అని నేడు పిలిచే ఎత్తైన కొండపై శ్రీ రాముని పాదములు కలదు. ఆ కొండపై సైతం లెక్కలెనన్ని గృహాలు ఉన్నాయి. పూర్వ కాలంలో మునులు, రుషులు సంవత్సరాల తరబడి తపస్సు చేశారని పూర్వీకుల కథనం. ఈ కొండపై విశేష వన మూలికలు ఉన్నాయి. అక్కడ గల సరస్సులోని నీళ్ళతో స్నానం చేసి ఆ నీరును తాగి రాముని పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు అన్ని ఇట్టే నెరవేరుతాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. కోటకు దక్షిణాన పెద్దవాగు కలదు. దాన్ని పక్కనే ధర్మరాజుల బండ కలదు. ఇక్కడికి పంచపాండవులు సైతం తమ అరణ్యవాసంలో వచ్చినట్లు పూర్వీకులు అంటారు. కోటకు తూర్పుభాగాన ఎత్తైన కొండపై వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి మనహారాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల వారు సంవత్సరం పొడవున వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు.

మొహర్రం విశిష్టత
కోయిలకొండలో ప్రతి సంవత్సరం మొహర్రం పండగకు ఎంతో విశిష్టత ఉంది. దిశ నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు వచ్చి కోటపై గల బీబీ ఫాతిమాను దర్శించుకుంటారు. కాగా ఈ మొహర్రం పండగను ఇక్కడ మతసామరస్యంతో హిందూ, ముస్లింలు ఐక్యతతో జరుపుకోవడం ప్రత్యేకత. హిందూ, మహ్మదీయుల సంప్రదాయాలను ఏకం చేసి ఈ ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

విభాగాలు:హబూబ్‌నగర్ జిల్లా కోటలుతెలంగాణ కోటలు, కోయిలకొండ మండలము,  

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక