కోటకదిర మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2011 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4277. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 18 కిమీ దూరంలో ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం గ్రామం మీదుగా వెళుతున్నది. గ్రామంలో రైల్వేస్టేషన్ కూడా ఉంది. గ్రామశివారులో అప్పిరెడ్డి చెరువు ఉంది. ఇది ఎంపీటిసి నియోజకవర్గం కేంద్రం. ప్రముఖ వాగ్గేయకారుడు మన్నెంకొండ హనుమద్దాసు ఈ గ్రామానికి చెందినవారు. గ్రామంలో చంద్రమౌళిస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా జాతర నిర్వహిస్తారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ గ్రామం భౌగోళికంగా మండలంలో పశ్చిమం వైపున దేవరకద్ర మరియు కోయిలకొండ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మాచన్‌పల్లి గ్రామం ఉండగా, దక్షిణాన ఓబ్లాయిపల్లి గ్రామం, పశ్చిమాన దేవరకద్ర మండలం, ఉత్తరమున కోయిలకొండ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3278. ఇందులో పురుషులు 1595, మహిళలు 1683. గృహాల సంఖ్య 734. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4277. ఇందులో పురుషులు 2124, మహిళలు 2153. గృహాల సంఖ్య 908. అక్షరాస్యత శాతం 40.59% రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా మల్లు లలితమ్మ ఎన్నికయ్యారు. చంద్రమౌళిస్వామి ఆలయం: సుమారు వందేళ్ళ క్రితం జీవసమాధి అయిన చంద్రమౌళిస్వామి ఈ గ్రామప్రజలకు ఇష్టదైవం. ఏటా జూలై మాసంలో జాతర నిర్వహించి రథోత్సవం కూడా జరుపుతారు. ఆయన సమాధినే ఆలయంగా నిర్మించి నిత్యపూజలు జరుపుతున్నారు.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి