19, ఏప్రిల్ 2013, శుక్రవారం

మాదారం (Madharam)

మాదారం 
గ్రామముమాదారం
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా585 (2001),
757 (2011)
దర్శనీయ ప్రదేశాలుతిరుమలనాథస్వామి ఆలయం
గ్రామ కోడ్ సంఖ్య 575061
మాదారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 585. మాదారం ర్యాకమకొండపై శ్రీతిరుమలనాథస్వామి వెలసినారు. అలాగే వాసరాయస్వామి ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయం, గోపాలస్వామి ఆలయం, నాగులగుడి, నరసింహస్వామి ఆలయం, శివాలయం ఉన్నాయి.

భౌగోళికం, సరిహద్దులు:
మాదారం గ్రామము భౌగోళికంగా హన్వాడ మండలం మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మండల కేంద్రం హన్వాడ, ఉత్తరమున అమ్మాపూర్, దక్షిణమున యరన్‌పల్లి, పశ్చిమాన దోరసముద్రం గ్రామాలున్నాయి

తిరుమలనాథస్వామి ఆలయం:
ఎత్తయిన కొండ గుహల ప్రాంతంలో తిరుమలనాథస్వామి స్వయంభూవుగా వెలిశారు. ఈ ఆలయానికి 350 సం.ల చరిత్ర ఉంది. నరసింహస్వామి రాతికొండలోంచి చీల్చుకొస్తున్నట్లుగా ఆలయ ముఖద్వారం వద్ద ప్రతిమ ఉంది. రాతిగుండుపై శ్రీఆంజనేయస్వామి ప్రతిమ ఉంది. మహబూబ్ నగర్ నుంచి ర్యాకమకొండకు వెళ్ళుటకు వేపూర్, చంద్రాస్‌పల్లి, కొత్లాబాద్ వైపు వెళ్ళే బస్సులలో యూరోనిపల్లి గేటు వద్ద దిగి అటునుంచి స్వామివారి ముఖద్వారం గుండా సుమారు మూడున్నర కిమీ కాలినడకన వెళ్ళాలి. ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 585. ఇందులో పురుషులు 306, మహిళలు 279. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 757. ఇందులో పురుషులు 384, మహిళలు 373. గృహాల సంఖ్య 146, అక్షరాస్యత శాతం 38.1%. గ్రామ కోడ్ సంఖ్య 575061.

విద్యాసంస్థలు:
గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి