ఓబ్లాయిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా మహబూబ్‌నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది గ్రామపంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1414. ఈ గ్రామము మహబూబ్‌నగర్ పట్టణం నుచి 15 కిమీ దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. ఇది ఎంపీటిసి నియోజకవర్గం కేంద్రం.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున దేవరకద్ర మండలం సరిహద్దుగా ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున అప్పాయిపల్లి, ఉత్తరమున మాచన్‌పల్లి, పశ్చిమాన ఓబ్లాయిపల్లి గ్రామాలు, దక్షిణాన దేవరకద్ర మండలము సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1414. ఇందులో పురుషులు 723, మహిళలు 691. గృహాల సంఖ్య 276. రవాణా సౌకర్యాలు: ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా అతి కేంద్రానికి సమీపంలో ఉండుట మరియు రాయచూరు ప్రధాన రహదారిపై ఉండుటచే బస్సులు, ప్రైవేటు వాహనాల వల్ల రవాణావసతులు బాగుగా ఉన్నాయి. రాజకీయాలు: 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామసర్పంచిగా రామకిష్టమ్మ ఎన్నికయ్యారు.
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి