టంకర మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3629. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: టంకర గ్రామానికి బుద్ధారం గుడిమల్కాపూర్, తూర్పున దాక్షక్‌పల్లి, పశ్చిమాన హన్వాడ, దక్షిణమున కొత్తపేట, పెద్దదర్పల్లి గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3629. ఇందులో పురుషులు 1865, మహిళలు 1764. ఇది మండలంలో నాలుగవ పెద్ద గ్రామము. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4266. ఇందులో పురుషులు 2134, మహిళలు 2132. గృహాల సంఖ్య 852, అక్షరాస్యత శాతం 36.2%. గ్రామ కోడ్ సంఖ్య 575068. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 55 ఓట్ల మెజారిటి లభించింది. విద్యాసంస్థలు: మండల పరిషత్తు మాధ్యమిక పాఠశాల ఉంది.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి