24, ఏప్రిల్ 2013, బుధవారం

పెద్దదర్పల్లి (Peddadarpally)

పెద్దదర్పల్లి గ్రామము
గ్రామముపెద్దదర్పల్లి
మండలముహన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1994 (2001),
2480 (2011),
గ్రామ కోడ్ సంఖ్య575065
పెద్దదర్పల్లి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2008లో గ్రామానికి నిర్మల్ పురస్కారం లభించింది. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1994. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 8 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 196 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
నాయినోనిపల్లి గ్రామానికి తూర్పున కొత్తపేట, చిన్నదర్పల్లి, పశ్చిమాన హన్వాడ, ఉత్తరమున టంకర గ్రామాలు, దక్షిణమున మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1994. ఇందులో పురుషులు 1010, మహిళలు 984.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2480. ఇందులో పురుషులు 1231, మహిళలు 1249. గృహాల సంఖ్య 504, అక్షరాస్యత శాతం 45.6%. గ్రామ కోడ్ సంఖ్య 575065.

రాజకీయాలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 17 ఓట్ల మెజారిటి లభించింది.

విద్యాసంస్థలు:
మండల పరిషత్తు మాధ్యమిక పాఠశాల ఉంది. కొత్తచెరువు తండాలో ప్రాథమిక పాఠశాల ఉంది.
విభాగాలు: హన్వాడ మండలములోని గ్రామాలు,  


సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి