యరన్‌పల్లి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 526. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 15 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 60% (127 హెక్టార్ల) అటవీప్రాంతం ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: యరన్‌పల్లి గ్రామం భౌగోళికంగా మండలంలో దక్షిణం వైపున కోయిలకొండ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరమున మాదారం, దోరసముద్రం, తూర్పున హన్వాడ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా పశ్చిమాన మరియు దక్షిణమున కోయిలకొండ మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 526. ఇందులో పురుషులు 276, మహిళలు 250. ఇది మండలంలో అతిచిన్న గ్రామాలలో ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 536. ఇందులో పురుషులు 274, మహిళలు 262. గృహాల సంఖ్య 133, అక్షరాస్యత శాతం 41.6%. గ్రామ కోడ్ సంఖ్య 575060. విద్యాసంస్థలు: గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి