18, ఏప్రిల్ 2013, గురువారం

యెన్నం శ్రీనివాసరెడ్డి (Yennem Srinivas Reddy)

యెన్నం శ్రీనివాసరెడ్డి 03.01.1970న జన్మించారు. వెల్దండ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి. ఎం.ఏ, ఎంబీఏ అభ్యసించారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేసి 2002లో తెరాసలో ప్రవేశించి, 2007-09 కాలంలో తెరాస జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007లో పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా పోటీచేసి ఓటమి చెందారు. 2009లో తెరాస బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. 2012 మార్చి ఉప ఎన్నికలలో మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ మహబూబ్‌నగర్ నుంచి భాజపా తరఫున పోటీ చేసి స్వల్పతేడాతో తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ చేతిలో ఓడిపోయారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, వెల్దండ మండలము,  మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం13వ శాసనసభ సభ్యులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి