చిన్నదర్పలి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. 2011 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 4409. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 3 కిమీ దూరంలో తాండూరు వెళ్ళు రహదారిపై ఉంది. గ్రామపరిధిలో 228 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ప్రత్యేక పంచాయతీగా ఉన్న ఈ గ్రామాన్ని 2012లో మహబూబ్‌నగర్ పురపాలక సంఘంలో విలీనం చేశారు.
భౌగోళికం, సరిహద్దులు: చిన్నదర్పల్లి గ్రామం హన్వాడ మండలంలో దక్షిణం వైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన మరియు తూర్పున మహబూబ్‌నగర్ మండలం సరిదహద్దుగా ఉండగా, ఉత్తరమున కొత్తపేట గ్రామం, పశ్చిమాన పెద్దదర్పల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 3507. ఇందులో పురుషులు 1783, మహిళలు 1724. ఇది మండలంలో ఐదవ పెద్ద గ్రామము. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4409. ఇందులో పురుషులు 2240, మహిళలు 2169. గృహాల సంఖ్య 887, అక్షరాస్యత శాతం 43.9%. గ్రామ కోడ్ సంఖ్య 575066. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 82 ఓట్ల మెజారిటి లభించింది. విద్యాసంస్థలు గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, ప్రతిభ ప్రైవేట్ మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. చిర్మల్ కుచ తండా, పూజారి తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి. సంఘటనలు:
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి