అజిలాపూర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరం వైపున ఉన్నది.ఈ గ్రామానికి ఉత్తరాన బొల్లారం, దక్షిణాన నాగారం, గద్దెగూడెం, పశ్చిమాన చిన్నరాజమూర్ గ్రామాలు, తూర్పున మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1687. ఇందులో పురుషులు 836, మహిళలు 851. గృహాల సంఖ్య 288. రవాణా సౌకర్యాలు: గ్రామం గుండా ఎలాంటి ప్రధాన రహదారులు లేవు. అయిననూ కోయిలకొండ-దేవరకద్ర రహదారి సమీప గ్రామమైన చిన్నరాజమూర్ నుంచి వెళ్ళుచున్నది. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో షాహేన్ బేగం (తెరాస మద్దతు) సర్పంచిగా విజయం సాధించారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి