చిన్నరాజమూర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. గ్రామంలో 400 సంవత్సరాల క్రితం నాటి ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది.
భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఉత్తరం వైపున ధన్వాడ, కోయిలకొండ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన బొల్లారం, దక్షిణాన పెద్దరాజమూర్, తూర్పున అజిలాపూర్ గ్రామాలు, పశ్చిమాన ధన్వాడ, కోయిలకొండ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. గ్రామ సమీపం నుంచి పశ్చిమం వైపు పెద్దవాగు ప్రవహిస్తోంది. జనాభా: 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 1486. ఇందులో పురుషులు 739, మహిళలు 747. గృహాల సంఖ్య 269. రవాణా సౌకర్యాలు: గ్రామం గుండా కోయిలకొండ-దేవరకద్ర రహదారి వెళ్ళుచున్నది. సమీప రైల్వేస్టేషన్ దేవరకద్రలో ఉంది. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో రుక్మిణీబాయి (కాంగ్రెస్ పార్టీ మద్దతు) సర్పంచిగా విజయం సాధించారు.
= = = = =
| |||||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి