దేవరకద్ర మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది జిల్లా కేంద్రం నుంచి 20 కిమీ దూరంలో రాయచూర్ వెళ్ళు రహదారిపై ఉన్నది. ఈ గ్రామానికి రైలుసౌకర్యం కూడా ఉంది. మేజర్ గ్రామపంచాయతి ద్వారా గ్రామపాలన నిర్వహించబడుతున్నది. ఇక్కడ వ్య్వసాయ మార్కెట్ కమిటికూడా ఉంది. 1986 మండల వ్యవస్థకు పూర్వం ఈ గ్రామం ఆత్మకూరు తాలుకాలో భాగంగా ఉండేది.
రవాణా సౌకర్యాలు: రోడ్డురవాణా: హైదరాబాదు-రాయచూరు ప్రధాన రహదారిపై ఉండుటచే ఈ గ్రామానికి మంచి రోడ్డురవాణా సౌకర్యాలున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 20 కిమీ దూరంలోనే ఉంది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు, నారాయణపేట వెళ్ళు బస్సులు ఈ గ్రామం గుండా వెళతాయి. ప్రైవేట్ వాహనాలు కూడా గ్రామస్థులకు విరివిగా అందుబాటులో కలవు. రైలురవాణా: దేవరకద్ర రైల్వేస్టేషన్ సికింద్రాబాదు-డోన్ మార్గంలో ఉంది. మునీరాబాదు-మహబూబ్‌నగర్ కొత్త రైలుమార్గం కూడా ఇక్కడి నుంచే మొదలౌతుంది. దేవరకద్ర నుంచి కొత్తగా మరికల్ వరకు 20 కిమీ రైల్వేలైన్ కూడా నిర్మించబడింది. జనాభా: 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 7250. ఇందులో పురుషులు 3751, మహిళలు 3499. గృహాల సంఖ్య 1292. ఇది మండలంలో అత్యధిక జనాభా కల గ్రామము. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో శోభ (ఉమ్మడి అభ్యర్థి) సర్పంచిగా విజయం సాధించారు. వ్యవసాయ మార్కెట్ కమిటి: జిల్లాలోని 17 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఇది ఒకటి. మండలంలోని గ్రామాల రైతులే కాకుండా పరిసర మండలాలలోని రైతులుకూడా తమ పంటలను విక్రయించడానికి ఇది సౌకర్యంగా ఉన్నది. విశాలమైన స్థలం, గోదాములు, షెడ్డులు తదితరములు సౌకర్యంగా ఉన్నాయి. విద్యాసంస్థలు: ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. గ్రామ ప్రముఖులు: పులివీరన్న: మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసిన పులివీరన్న ఈ గ్రామానికి చెందినవారు. 2004లో ఇండిపెండెంౠగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీతరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే మరణించారు.
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి