హస్నాపూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2024. మండలంలో ఇది 10వ పెద్ద గ్రామము.
భౌగోళికం, సరిహద్దులు: హస్నాపూర్ గ్రామం మండలంలో భౌగోళికంగా వాయువ్యాన మహబూబ్‌నగర్ మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున అమిస్తాపూర్, దక్షిణాన అన్నాసాగర్, పశ్చిమాన తాడిపర్తి గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం సరిహద్దుగా ఉన్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1821. ఇందులో పురుషులు 922, మహిళలు 899. గృహాల సంఖ్య 346. ఈ గ్రామము మండలంలోనే 10వ పెద్ద గ్రామము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2024. ఇందులో పురుషులు 1031, మహిళలు 993. గృహాల సంఖ్య 407. అక్షరాస్యత శాతం 45.26%. గ్రామ కోడ్ సంఖ్య 575541. రవాణా సౌకర్యాలు: గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారులు లేకున్ననూ 44వ నెంబరు జాతీయ రహదారి సమీపంలో ఉన్నది. సరిహద్దు గ్రామం అన్నాసాగర్ మీదుగా జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 8 కిమీ దూరంలో ఉన్నది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో తిరుపతయ్య (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా కొండయ్య ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది. విద్యాసంస్థలు: గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, అనుబంధ గ్రామమైన సేరిపల్లిలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి