తాడిపర్తి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1708.
భౌగోళికం, సరిహద్దులు: తాడిపర్తి గ్రామం మండలంలో భౌగోళికంగా ఉత్తరాన మహబూబ్‌నగర్ మరియు జడ్చర్ల మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన కొత్తూర్, పశ్చిమాన భూత్పూర్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా, ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం, తూర్పున జడ్చర్ల మండలం సరిహద్దులుగా ఉన్నవి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1377. ఇందులో పురుషులు 679, మహిళలు 698. గృహాల సంఖ్య 266. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1708. ఇందులో పురుషులు 860, మహిళలు 848. గృహాల సంఖ్య 337. అక్షరాస్యత శాతం 43.74%. గ్రామ కోడ్ సంఖ్య 575544. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో బాలస్వామి (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా ఫజియోద్దీన్ ఎన్నికయ్యారు. రవాణా సౌకర్యాలు: గ్రామం మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 15 కిమీ దూరంలో ఉన్నది. విద్యాసంస్థలు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక ఉర్దూమీడియం మండలపరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి