7, మే 2013, మంగళవారం

కొత్తమొల్గర (Kothamolgara)

కొత్తమొల్గర గ్రామము
గ్రామముకొత్తమొల్గర 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2202 (2011)
2124 (2001)
కొత్తమొల్గర మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. భౌగోళికంగా మండలం మధ్యలో ఉన్న ఈ గ్రామం మహబూబ్‌నగర్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్నది. 2011 ప్రకారం గ్రామ జనాభా 2202.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో మధ్యగా ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున కరివెన, దక్షిణాన పాతమొల్గర, మద్దిగట్ల, ఉత్తరాన గోప్లాపూర్, భూత్పూర్, పశ్చిమాన కప్పెట గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2124. ఇందులో పురుషులు 2124, మహిళలు 1076. గృహాల సంఖ్య 457.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2202. ఇందులో పురుషులు 1115, మహిళలు 1087. గృహాల సంఖ్య 472. అక్షరాస్యత శాతం 51.50%. గ్రామ కోడ్ సంఖ్య 575547.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్-శ్రీశైలం ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. భూత్పూర్ గ్రామానికి సమీపంలో ఉండుటచే జాతీయ రహదారి కూడా అందుబాటులో ఉన్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 12 కిమీ దూరంలో ఉన్నది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో నాగిరెడ్డి (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా టి.నారాయణమ్మ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నాయి.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి