6, మే 2013, సోమవారం

కరివెన (Karivena)

 కరివెన గ్రామము
గ్రామముకరివెన 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా5005 (2011)
4376 (2001)
కరివెన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం మండలంలో తూర్పు వైపున తిమ్మాజీపేట మండలం సరిహద్దులో ఉన్నది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5005. భౌగోళికంగా మండలంలో ఇది పెద్ద గ్రామము. ఈ గ్రామంలో 2015, జూన్ 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయబడింది.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ గ్రామానికి తూర్పున తిమ్మాజీపేట మండలం, ఉత్తరాన జడ్చర్ల మండలం మరియు కొత్తూర్ గ్రామం, పశ్చిమాన కొత్తమొల్గర గ్రామం, దక్షిణాన మద్దిగట్ల, ఎల్కిచెర్ల గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4376. ఇందులో పురుషులు 2214, మహిళలు 2162. గృహాల సంఖ్య 825. మండలంలో ఇది నాలుగవ అత్యధిక జనాభా కల్గిన గ్రామము.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 5005. ఇందులో పురుషులు 2534, మహిళలు 2471. గృహాల సంఖ్య 1067. అక్షరాస్యత శాతం 42.44%. గ్రామ కోడ్ సంఖ్య 575546.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారి లేదు. అయిననూ మహబూబ్‌నగర్-శ్రీశైలం ప్రధాన రహదారి గ్రామ సమీపం నుంచి సరిహద్దు గ్రామమైన కొత్తమొల్గర మీదుగా వెళ్ళుచున్నది.మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 16 కిమీ దూరంలో ఉంది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో దేవూజీ (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా గడ్డం సునీత ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఒక ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల (విశ్వభారతి విద్యామందిర్), ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామానికి అనుబంధ గ్రామాలైన ముస్లాయిపల్లి, లంబాడికుంట తండా, చౌలతండా, ఏకులగట్టతండాలలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలున్నాయి.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి