6, మే 2013, సోమవారం

కొత్తూర్ (Kothur)

 కొత్తూర్ గ్రామము
గ్రామముకొత్తూర్ 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1464 (2001)
1840 (2011)
కొత్తూర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామము మండల కేంద్రం భూత్పూర్‌కు సమీపంలో ఉన్నది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1840.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో ఈశాన్యాన జడ్చర్ల మండలం సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి ఉత్తరాన తాడిపర్తి, దక్షిణాన కరివెన, పశ్చిమాన భూత్పూర్ గ్రామాలు, తూర్పున జడ్చర్ల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1464. ఇందులో పురుషులు 725, మహిళలు 739. గృహాల సంఖ్య 355.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1840. ఇందులో పురుషులు 922, మహిళలు 918. గృహాల సంఖ్య 405. అక్షరాస్యత శాతం 36.41%. గ్రామ కోడ్ సంఖ్య 575545.

రవాణా సౌకర్యాలు:
గ్రామం మీదుగా ప్రధాన రహదారి లేకున్ననూ మహబూబ్‌నగర్-శ్రీశైలం రహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. జాతీయ రహదారి కూడా గ్రామానికి కొద్దిదూరంలోనే ఉన్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 12 కిమీ దూరంలో ఉంది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో మాధవరెడ్డి (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా జి.గంగమ్మ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, అనుబంధ గ్రామాలైన కొత్తూరుతండా, టేక్యాతండాలలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలున్నాయి.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి