3, మే 2013, శుక్రవారం

మల్లు రవి (Mallu Ravi)

మల్లు రవి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వృత్తిరీత్యా వైద్యుడైన మల్లు రవి 1980-82 కాలంలోనే గాంధీ మెడికల్ కళాశాలలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం నాయకుడిగా వ్యవహరించారు. విద్యార్థి దశలోనే రాజకీయ దృష్టిపెట్టారు. సోదరుడు మల్లు అనంతరాములు నాగర్‌కర్నూల్ లోకసభ సభ్యునిగా ఉంటూ మరణించిన పిదప ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి 1991లో జరిగిన నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో నెగ్గి పార్లమెంటులోకి ప్రవేశించారు. 1996 నుంచి ఏఐసిసి సభ్యుడిగా పనిచేశారు. 2002-04 కాలంలో పిసిసి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2005లో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రత్నిధిగా నియమించబడ్డారు.

2008లో తెరాస సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మల్లు రవి జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికలలో కూడా జడ్చర్ల నుంచి పోటీచేసిననూ విజయం చేకూరలేదు.



ఇవి కూడా చూడండి:

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులుజడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం, ఖమ్మం జిల్లా రాజకియ నాయకులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి