23, జనవరి 2013, బుధవారం

జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం (Jadcherla Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు కలవు. పునర్వవస్థీకరణ ఫలితంగా ఇదివరకు షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న బాలానగర్, నవాబ్‌పేట మండలాలు ఈ నియోజకవర్గంలో కలవగా, ఇక్కడి నుంచి తిమ్మాజీపేట మండలం నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి తరలించబడింది. ఈ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. 1961లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. ఇక్కడి నుండి 3 సార్లు స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందినారు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచింది. 2008 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, 2009 శాసనసభ ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందినారు. 2014 మరియు 2018లలో తెరాసకు చెందిన లక్ష్మారెడ్డి గెలుపొందినారు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజకవర్గ భౌగోళిక సమాచారం

జడ్చర్ల నియోజకవర్గానికి ఉత్తరాన షాద్‌నగర్ నియోజకవర్గం ఉండగా, తూర్పున కల్వకుర్తి నియోజకవర్గం ఉంది. దక్షిణాన నాగర్‌కర్నూల్ నియోజకవర్గం మరియు కొంతభాగం దేవరకద్ర నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమాన మహబూబ్‌నగర్ నియోజకవర్గం మరియు రంగారెడ్డిజిల్లాకు చెందిన పరిగి నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం మధ్య నుండి బాలానగర్, జడ్చర్ల మండలాల మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళుతుంది.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 కొత్త కేశవులు స్వతంత్ర అభ్యర్థి కె.జె.రెడ్డి భారతీయ జాతీయ కాంగ్రెస్
1967 లక్ష్మీ నరసింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఎం.రాందేశారెడ్డి భారతీయ జాతీయ కాంగ్రెస్
1972 ఎన్.నర్సప్ప కాంగ్రెస్ పార్టీ జి.విశ్వనాథం స్వతంత్ర అభ్యర్థి
1978 ఎన్.నరసప్ప భారత జాతీయ కాంగ్రెస్ రఘునందన్ రెడ్డి జనతా పార్టీ
1983 కృష్ణారెడ్డి ఇండిపెండెంట్ (స్వతంత్ర) ఎన్.నరసప్ప భారత జాతీయ కాంగ్రెస్
1985 ఎం.కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్.నరసప్ప భారత జాతీయ కాంగ్రెస్
1989 సుధాకర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 ఎం.సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ పెద్ద నర్సప్ప భారత జాతీయ కాంగ్రెస్
1996 ఎం.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ జి.సుధాకర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1999 ఎం.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ మహ్మద్ అల్లాజీ భారత జాతీయ కాంగ్రెస్
2004 సి.లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి ఎం.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ
2008 మల్లు రవి కాంగ్రెస్ పార్టీ ఎం.చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ
2009 ఎర్ర చంధ్రశేఖర్ తెలుగుదేశం పార్టీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ
2014 చెర్లకోల లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి మల్లు రవి కాంగ్రెస్ పార్టీ
2018 చెర్లకోల లక్ష్మారెడ్డి తెరాస మల్లు రవి కాంగ్రెస్ పార్టీ


వివిధ పార్టీల బలాబలాలు
1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండేది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇరుపార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ 4 పర్యాయాలు విజయం సాధించింది. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితికి వదిలి మద్దతు ఇచ్చింది. తెరాసకు చెందిన సి,లక్ష్మారెడ్డి సమీప తెలుగుదేశం ప్రత్యర్థి ఎం.చంద్రశేఖర్ పై 18381 ఓట్ల తేడాతో ఓడించారు. తెలంగాణా అంశంపై తెరాస శాసనసభ్యులు మూకుమ్మడి రాజీనామాల ఫలితంగా 2008లో మళ్ళీ ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. 2008 ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎం.చంద్రశేఖర్ పై 2,106 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజీనామా చేసి పోటీకి నిలబడ్డ తెరాస అభ్యర్థి లక్ష్మారెడ్డి మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. 2009 శాసనసభ ఎన్నికలలో మహాకూటమి తరఫున పోటీలోకి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్ర చంద్రశేఖర్ సిటింగ్ ఎమ్మేల్యే మల్లు రవిపై 6890 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

1999 ఎన్నికలు
1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మహ్మద్ అల్లాజీపై 24642 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. ఎం.చంద్రశేఖర్ 49450 ఓట్లు సాధించగా, అల్లాజీకి 24808 ఓట్లు లభించాయి

2004 ఎన్నికలు
గత నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి విజయం సాధించడంతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని తెలంగాణా రాష్ట్ర సమితికి వదిలివేసింది. తెరాస తరఫున లక్ష్మారెడ్డి పోటీచేసి 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థి ఎం.చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. లక్ష్మారెడ్డి 63,480 ఓట్లను పొందగా, ఎంచంద్రశేఖర్ 45,099 ఓట్లు సాధించారు.

2008 ఉప ఎన్నికలు
2004లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన తెరాస నుంచి గెలుపొందిన సి.లక్ష్మారెడ్డి రాజీనామాతో మళ్ళీ ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. పోలెపల్లి సెజ్‌లకు వ్యతిరేకంగా అనేకులు ఎన్నికల బరిలో నిలబడటంతో మొత్తం 25 అభ్యర్థులు పోటీపడ్డారు. తెరాస తరఫున మళ్ళీ సి.లక్ష్మారెడ్డి అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున మాజీ శాసనసభ్యుడు ఎం.చంద్రశేఖర్, కాంగ్రెస్ తరఫున మల్లు రవి పోటీచేశారు. తెలుగుదేశం అభ్యర్థి ఎం.చంద్రశేఖర్‌కు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ఇద్దరికీ సోదరుల వారసత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి 2008 ఉప ఎన్నికలలో సమీప ప్రత్యర్థి ఎం.చంద్రశేఖర్‌పై విజయం సాధించారు.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎం.చంద్రశేఖర్ పోటీ చేయగా, భారతీయ జనతా పార్టీ తరఫున గొల్లమూరి శౌరి ప్రజారాజ్యం పార్టీ నుండి వి.రాంరెడ్డి మరియు లోక్‌సత్తా పార్టీ నుండి వడ్ల శ్రీను పోటీచేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యరుల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యరి ఎర్ర చంద్రశేఖర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సిటింగ్ ఎమ్మేల్యే మల్లు రవిపై 6890 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారుడు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరస తరఫున పోటీచేసిన చెర్లకోల లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లురవిపై 14534 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున చెర్నకోల లక్ష్మారెడ్డి, భాజపా తరఫున మధుసూదన్ యాదవ్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లురవి పోటీచేశారు. తెరాసకు చెందిన చర్లకోల లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లురవి పై 45082 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గ ప్రముఖులు
  • కొత్త కేశవులు:
  • లక్ష్మీ నరసింహారెడ్డి:
  • ఎన్.నర్సప్ప:
  • ఎం.కృష్ణారెడ్డి:
  • సుధాకర్ రెడ్డి:
  • ఎం.సత్యనారాయణ:
  • ఎం.చంద్రశేఖర్:
  • సి.లక్ష్మారెడ్డి
  • మల్లు రవి:

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,  జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక