పోతులమడుగు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామములో గొర్రెల మార్కెట్ ఉంది. 2010 నవంబరు 14న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి పార్థసారథి గొర్రెల మార్కెట్‌ను ప్రారంభించారు. పోతులమడుగు గ్రామంలో మండలంలోనే పెద్దదైన మొగుళ్ళచెరువు ఉంది. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2686.
భౌగోళికం, సరిహద్దులు: పోతులమడుగు గ్రామం మండలంలో భౌగోళికంగా మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున గోప్లాపూర్ ఖుర్ద్, దక్షిణాన రావిలపల్లి, కప్పెట, పశ్చిమాన హస్నాబాద్, ఉతరాన అమిస్తాపూర్ గ్రామాలు సరిహద్దులుగాఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2423. ఇందులో పురుషులు 1223, మహిళలు 1200. గృహాల సంఖ్య 476. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2686. ఇందులో పురుషులు 1350, మహిళలు 1336. గృహాల సంఖ్య 593. అక్షరాస్యత శాతం 45.90%. గ్రామ కోడ్ సంఖ్య 575549. రవాణా సౌకర్యాలు: గ్రామం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది. అన్నాసాగర్, భూత్పూర్ మధ్యలో ఈ గ్రామం కలదు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 16 కిమీ దూరంలో ఉన్నది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో ఎం.సత్యనారాయణ (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా హరియానాయక్ ముదావత్ ఎన్నికయ్యారు. చరిత్ర: గ్రామానికి రెండువేల సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనుల, బాదామి చాళుక్యుల, గోనవంశీయుల పాలనలో గ్రామం భాగంగా ఉండేది. గ్రామంలో 13వ శతాబ్దికి చెందిన వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. విద్యాసంస్థలు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల కలవు.అనుబంధ గ్రామైన గోపన్నపల్లిలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది. అధ్యాత్మికం: పురాతనమైన వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, పోషమ్మ, కోటమైసమ్మ ఆలయాలు ఉన్నాయి.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి