ఇప్పలపల్లి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.
భౌగోళికం, సరిహద్దులు: ఇప్పలపల్లి గ్రామం మండలంలో భౌగోళికంగా పశ్చిమాన మహబూబ్‌నగర్ మరియు అడ్డాకల్ మండలాల సరిహద్దులో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున హస్నాపుర్, దక్షిణాన తాడికొండ గ్రామాలు సరిహద్దులుగాఉండగా, ఉత్తరాన మహబూబ్‌నగర్ మండలం, పశ్చిమాన అడ్డాకల్ మండలం సరిహద్దులుగా ఉన్నావి. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1230. ఇందులో పురుషులు 613, మహిళలు 617. గృహాల సంఖ్య 266. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1736. ఇందులో పురుషులు 871, మహిళలు 865. గృహాల సంఖ్య 342. అక్షరాస్యత శాతం 39.86%. గ్రామ కోడ్ సంఖ్య 575540. రవాణా సౌకర్యాలు: గ్రామం మీదుగా ఎలాంటి ప్రధాన రహదారిలేదు. అయిననూ 44వ నెంబరు జాతీయ రహదారి సరిహద్దు గ్రామాలైన అన్నాసాగర్, తాడికొండల మీదుగా వెళ్ళుచున్నది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 12 కిమీ దూరంలో ఉన్నది. రాజకీయాలు: 2006 సర్పంచి ఎన్నికలలో లక్ష్మమ్మ (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా కుమ్మరి అంజమ్మ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి