8, మే 2013, బుధవారం

తాటికొండ (Tatikonda):

  తాటికొండ గ్రామము
గ్రామముతాటికొండ 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4760 (2011)
4397 (2001)
తాటికొండ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4760. గ్రామంలోని వీరన్న చెరువు మండలంలోనే పెద్దది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున అడ్డాకల్ మండలం సరిహద్దులో ఉన్నది. ఉత్తరాన ఇప్పలపల్లి, తూర్పున అన్నాసాగర్ గ్రామాలు సరిహద్దులుగా ఉండగా మిగితా అన్నివైపులా అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉన్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4397. ఇందులో పురుషులు 2243, మహిళలు 2154. గృహాల సంఖ్య 792. అమిస్తాపూర్, భూత్పూర్ ల తర్వాత మండలంలో ఇది మూడవ అత్యధికజనాభా కల గ్రామము.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 4760. ఇందులో పురుషులు 2409, మహిళలు 2351. గృహాల సంఖ్య 940. అక్షరాస్యత శాతం 44.60%. గ్రామ కోడ్ సంఖ్య 575551.

రవాణా సౌకర్యాలు:
44వ నెంబరు జాతీయ రహదారి గ్రామం సమీపం నుంచి వెళ్ళుచున్నది. జాతీయ రహదారిపై ఉన్న అన్నాసాగర్ ఈ గ్రామానికి సమీపంలో ఉన్నది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో మేనకాదేవి (తెలుగుదేశం పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా టి.శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో మూడు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు, ఒక మండల పరిషత్తు ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల, ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కలవు.

వీరన్నచెరువు:
గ్రామపరిధిలో 670 ఎకరాల ఆఉఅకట్టు ఉన్న వీరన్నచెరువు ఉంది. ఇది మండలంలోనే పెద్ద చెరువు. చెరువు సమీపంలోని కోండపై వీరభద్ర ఆలయం ఉంది. ఈ చెరువు వల్ల 3 గ్రామాల పంటపొలాలకు నీరందించడమే కాకుండా మత్య్సకారులకు జీవనోపాధి కల్గిస్తోంది.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి