8, మే 2013, బుధవారం

రావులపల్లి (Ravulapalli)

 రావులపల్లి గ్రామము
గ్రామమురావులపల్లి 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా736 (2011)
635 (2001)
రావులపల్లి మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. 2011 ప్రకారం గ్రామ జనాభా 736. ఇది రెవెన్యూ గ్రామం అయిననూ పంచాయతి కేంద్రం కాదు.

భౌగోళికం, సరిహద్దులు:

భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణాన అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉండగా, ఉత్తరాన పోతులమడుగు, తూర్పున కప్పెట, పశ్చిమాన అన్నాసాగర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 635. ఇందులో పురుషులు 316, మహిళలు 319. గృహాల సంఖ్య 117. ఈ గ్రామం జనాభా పరంగా మండలంలోనే అతి చిన్న రెవెన్యూ గ్రామం.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 736. ఇందులో పురుషులు 373, మహిళలు 363. గృహాల సంఖ్య 159. అక్షరాస్యత శాతం 52.45%. గ్రామ కోడ్ సంఖ్య 575552.

రవాణా సౌకర్యాలు:

44వ నెంబరు జాతీయ రహదారికి కొద్దిగా లోపలికి ఉన్న ఈ గ్రామానికి రవాణా సౌకర్యాలు తక్కువే. జాతీయ రహదారిపై ఉన్న అన్నాసాగర్, భూత్పూల గ్రామాల నుంచి అందుబాటులో ఉన్నాయి.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.

విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి