1, డిసెంబర్ 2013, ఆదివారం

ఆలంపూర్ సంగమేశ్వరాలయం (Alampur Sanameshwar Temple)

 కూడలి సంగమేశ్వరాలయం
గ్రామంఆలంపూర్
జిల్లాజోగులాంబ గద్వాల
నిర్మాణ కాలంక్రీ.శ.6వ శతాబ్దం
శైలిబాదామి చాళుక్య
ప్రాచీనమైన కూడలి సంగమేశ్వరాలయం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో ఉంది. 1980కి ముందు ఈ ఆలయం కృష్ణా-తుంగభద్రల సంగమ ప్రాంతమైన కూడలిలో ఉండగా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ప్రాజెక్టు జలాశయం ముంపు ప్రాంతంలో ఉన్నందున ఆలయం మొత్తం తుంగభద్ర నదితీరాన ఉన్న ఆలంపూర్‌కు తరలించి యధాతథంగా పునర్మించడం జరిగింది. ఇలా ఒక కట్టడం మొత్తాన్ని మరో ప్రాంతంలో అవే ఆధారాలతో నిర్మించడం ఇది దేశంలోనే తొలిసారి మరియు ప్రపంచంలో రెండవది.

ఈ ఆలయం 5,200 ఏళ్ల నాటిదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ద్వాపర యుగంలో ధర్మరాజు నింబదారు శివలింగాన్ని ప్రతిష్టించినట్లుగా చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతమున్న శిల్పరమణీయ ఆలయం మాత్రం బాదామి చాళుక్య చక్రవర్తి రెండో పులకేశి కాలంలో నిర్మించినట్లు శాసనాధారాలున్నాయి. ఈ ఆలయం గోడలపైన చుట్టూ అపురూపమైన దేవతా విగ్రహాలు, ఇతర శిల్ప సంపద ఉన్నాయి..




విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  ఆలంపూర్, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి