అమ్మిరెడ్డిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామసమీపంలో ఉప్పుకుంట చెరువు ఉంది. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం, చిట్టిగుట్టపై సితారామాంజనేయస్వామి ఆలయం ఉంది. ఏటా జాతర జరుగుతుంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1601. ఇందులో పురుషులు 773, మహిళలు 828. గృహాల సంఖ్య 292. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1770. ఇందులో పురుషులు 866, మహిళలు 904. గృహాల సంఖ్య 332. అక్షరాస్యత శాతం 33.79%. గ్రామ కోడ్ సంఖ్య 575455. రాజకీయాలు: 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా స్వప్న ఎన్నికయ్యారు. 2006-11 కాలంలో కిష్టప్ప సర్పంచిగా పనిచేశారు. గ్రామపాలన: గ్రామపాలన గ్రామపంచాయతిచే నిర్వహించబడుతుంది. గ్రామపంచాయతి పరిధిలో అమ్మిరెడ్డిపల్లితో పాటు బస్సిరెడ్డీపల్లి అనుబంధ గ్రామం కూడా భాగంగా ఉంది. 2013 జూలైలో గ్రామసర్పంచిగా స్వప్న ఎన్నికయ్యారు. పంటలు: గ్రామంలో పండే ముఖ్య పంటలు వరి, పత్తి, వేరుశనగ. దేవాలయాలు: గ్రామంలో చిటిగుట్టపై శ్రీసీతారామస్వామి ఆలయం ఉంది. గ్రామంలో నడిబొడ్డున ప్రాచీన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఇటీవలే ఎస్.వెంకట్రాంరెడ్డి గారు స్వంతఖర్చుతో పునరుద్ధరణ కావించారు.
(గ్రామ సమాచారం వృద్ధికి తోడ్పడిన ఎస్.వెంకట్రాం రెడ్డి గారికి కృతజ్ఞతలతో)
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి