2, ఏప్రిల్ 2013, మంగళవారం

మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar Dist)

మహబూబ్‌నగర్ జిల్లా తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. మన్యంకొండ, కురుమూర్తి, గంగాపూర్, లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, కోయిలకొండ లాంటి పర్యాటక ప్రాంతాలు మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేకతలు. పల్లెర్ల హనుమంతరావు, సరోజినీ పుల్లారెడ్డి లాంటి స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. 44వ నెంబరు (పాతపేరు 7) జాతీయ రహదారి, సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం ఈ జిల్లానుంచే వెళ్ళుచున్నాయి. జిల్లాలో 3 పురపాలక సంఘాలు, 5 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ జిల్లాలో ప్రధాన వ్యవసాయ పంట వరి.

భౌగోళికం
తెలంగాణ రాష్ట్ర అవతరణ సమయంలో భౌగోళికంగా ఈ జిల్లా అతిపెద్దది. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జిల్లా నాలుగు ముక్కలైంది. 2019లో మళ్ళీ విభజించి నారాయణపేట జిల్లాను ఏర్పాటుచేశారు. దీనితో జిల్లాలో 15 మండలాలు మాత్రమే మిగిలాయి. జిల్లాకు ఉత్తరాన వికారాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా, తూర్పున నాగర్‌కర్నూల్ జిల్లా, దక్షిణాన వనపర్తి జిల్లా, పశ్చిమాన నారాయణపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
చరిత్ర
(తూర్పు కమాన్)
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు (Palamooru) అని రుక్మమ్మపేట (Rukmammapeta) అని పిలిచేవారు. ఆ తరువాత డిసెంబరు 4, 1890నందు అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 - 1911) పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చబడినది. క్రీ.శ. 1883నుండి జిల్లా కేంద్రానికి ఈ పట్టణము ప్రధానకేంద్రముగా వున్నది. ఒకప్పుడు ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి (చోళుల భూమి) అని పిలిచేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.

ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెల్సుకోవడానికి ఇబ్బందే. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. ఇక్కడి ప్రజలు పేదరికంతోను, బానిసత్వంలోను ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేరు. ఇప్పటికినీ ఈ ప్రాంతముధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు.

ఆధునిక చరిత్ర
హైదరాబాదు నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చినది. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు కూడా ఉంది. 1870లో నిజాం ప్రభుత్వం 8 తాలుకాలతో నాగర్ కర్నూల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి జిల్లాలో తాలుకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్‌కు బదిలీ చేశారు. స్వాతంత్ర్యానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాద్‌నగర్ మొదలగు సంస్థానాలు తాలుకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి. స్వాతంత్ర్యానికి పూర్వం 1930 దశాబ్దిలో జరిగిన ఆంధ్రమహాసభలలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అద్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్రమహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అద్యక్షత వహించగా, 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్రమహాసభకు బూర్గుల రామకృష్ణారావు అద్యక్షత వహించాడు. వీరిరువురూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులే. 1936లో ఐదవ ఆంధ్రమహాసభ జిల్లాలోని షాద్‌నగర్ లోనే జరిగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లానుంచి పలు ప్రాంతాలు విడదీసి, సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. జిల్లానుంచి పరిగి తాలుకాను విడదీసి హైదరాబాదు జిల్లా (ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా)కు కలిపినారు. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల, ఆలంపూర్ తాలుకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాకు జతచేశారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్‌ను ఇక్కడ విలీనం చేశారు. 1958లో కల్వకుర్తి తాలుకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేయబడింది. 1959లో రంగారెడ్డి జిల్లా లోని కొన్ని గ్రామాలు షాద్‌నగర్‌కు బదిలీ చేయబడ్డాయి. 1959 నాటికి జిల్లాలో 11 తాలుకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలుకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. 2014, జూన్ 2న కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జిల్లా 4 ముక్కలై కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పాటు కావడమే కాకుండా జిల్లా ఈశాన్య ప్రాంతంలోని 7 మండలాలు రంగారెడ్డీ జిల్లాలో వాయువ్య ప్రాంతంలోని 3 మండలాలు వికారాబాదు జిల్లాలో విలీనం చేయబడ్డాయి. ఫిబ్రవరి 2019లో మళ్ళీ రెండు ముక్కలై పశ్చిమ భాగంలోని మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది. ప్రస్తుతం 15 మండలాలతో చిన్న జిల్లాగా మారింది.

నిజాం విమోచనోద్యమం
నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ప్రముఖ స్థానం పొందింది. ఎందరో పోరాటయోధులు తమప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి నిజాం ముష్కరుల చేతితో అమరులైనారు. మరికొందరు జైలుపాలయ్యారు. పల్లెర్ల హనుమంతరావు లాంటి ప్రముఖులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. మహబూబ్‌నగర్ పట్టణంలో తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.


రవాణా సౌకర్యాలు
రైలు సౌకర్యం : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లాలో సికింద్రాబాదు-డోన్ రైలు మార్గం ఉంది. మహబూబ్ నగర్ పట్టణంలోనే 4 రైల్వేస్టేషన్లు కలవు.దేవరకద్ర నుంచి రాయచూరుకు రైలుమార్గం నిర్మాణపనులు సాగుతున్నాయి.

రోడ్డు సౌకర్యం
: దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయిన 44వ నెంబరు (పాత పేరు 7 వ నెంబరు) జాతీయ రహదారి మహబూబ్ నగర్ జిల్లా గుండా వెళ్తుంది. జడ్చర్ల నుంచి రాయచూరు వరకు కూడా జాతీయ రహదారి ఉంది.


పరిశ్రమలు
రాష్ట్రంలోనే తొలి సెజ్ జడ్చర్ల సమీపంలోని పోలెపల్లిలో ప్రారంభమైంది. జాతీయ రహదారిపై ఉన్న మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.


హోం
విభాగాలు: తెలంగాణ జిల్లాలు, మహబూబ్‌నగర్ జిల్లా మండలాలు

ఇవి కూడా చూడండి:

4 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక