20, డిసెంబర్ 2013, శుక్రవారం

అన్నారం (Annaram)

 అన్నారం గ్రామము
గ్రామముఅన్నారం 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1530 (2001)
1616 (2011)
అన్నారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి స్వగ్రామం.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1530. ఇందులో పురుషులు 800, మహిళలు 730. గృహాల సంఖ్య 356.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1616. ఇందులో పురుషులు 827, మహిళలు 789. గృహాల సంఖ్య 384. అక్షరాస్యత శాతం 52.97%. గ్రామ కోడ్ సంఖ్య 575201.

విద్యా సంస్థలు:
ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

ఉపగ్రహ సమాచార సేకరణ కేంద్రము:
సముద్ర తీరానికి సుమారు 1100 మీటర్ల ఎత్తులో ఉన్న షాద్ నగర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరం లో కల అన్నారం గ్రామ శివారు లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసారు. ఈ కేంద్రము ద్వారా కృత్రిమ ఉపగ్రహాలు పంపే వాతావరణం , భూగోళానికి సంబందించిన అన్ని సమాచారాలను సేకరిస్తుంది.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి