7, డిసెంబర్ 2013, శనివారం

అన్నాసాగర్ (Annasagar)

 అన్నాసాగర్ గ్రామము
గ్రామముఅన్నాసాగర్ 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభా1668 (2001)
1869 (2011)
అన్నాసాగర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామానికి చెందిన పార్వతమ్మ 2001, 2006లలో ఎంపీపీగా పనిచేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1668. ఇందులో పురుషులు 848, మహిళలు 820. గృహాల సంఖ్య 284.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1869. ఇందులో పురుషులు 932, మహిళలు 937. గృహాల సంఖ్య 349. అక్షరాస్యత శాతం 30.60%. గ్రామ కోడ్ సంఖ్య 575001.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా పార్వతమ్మ ఎన్నికైనది.

ఎంపిటీసి నియోజకవర్గం:
మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్వతమ్మ విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్లు 1631 కాగా పార్వతమ్మకు 818 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మమ్మకు 737 ఓట్లు లభించాయి.

విద్యాసంస్థలు:

గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.



విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి