16, డిసెంబర్ 2013, సోమవారం

బాలానగర్ (Balanagar)

  బాలానగర్ గ్రామము
గ్రామముబాలానగర్
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా3415 (2001)
1824 (2011)
బాలానగర్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామము 44వ నెంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల-షాద్‌నగర్ మధ్యలో ఉన్నది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా గ్రామం గుండా వెళ్ళుచున్నది. గ్రామంలో ఏపిజివిబి బ్యాంకు శాఖ ఉంది. ఏనుగుల వీరస్వామి కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామం మీదుగా వెళ్ళినారు. గ్రామం చుట్టూ కోట ఉన్నట్లుగా తెలిపినారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3415. ఇందులో పురుషులు 1743, మహిళలు 1672.గృహాల సంఖ్య 678.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3635. ఇందులో పురుషులు 1824, మహిళలు 1811. గృహాల సంఖ్య 848. అక్షరాస్యత శాతం 58.49%. గ్రామ కోడ్ సంఖ్య 575104.

రవాణా సౌకర్యాలు:
బాలానగర్ గ్రామం 7వ నెంబరు (కొత్త పేరు 44వ) జాతీయ రహదారిపై జడ్చర్ల మరియు షాద్‌నగర్‌ల మధ్యలో ఉంది. కాబట్టి గ్రామస్థులకు ఆర్టీసి మరియు ప్రైవేటు వాహనాలు బాగా అందుబాటులో ఉన్నాయి. గ్రామానికి రైలు సదుపాయం కూడా ఉంది. బాలానగర్ రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైళ్ళు ఆపుతారు.

గ్రామంలో ఉన్న కోట ముఖద్వారం


బాలానగర్ గ్రామపంచాయతి కార్యాలయం
బాలానగర్ మండల పరిషత్తు కార్యాలయము

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా వి.శాంతి దస్రం నాయక్ ఎన్నికయ్యారు.
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన భాగ్యమ్మ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతిపై 453 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 

కాలరేఖ:
  • 2014, ఆగస్టు 10: బాలానగర్ ఏపిజివిబి బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన దొంగతనం జరిగింది.


విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి