బాపన్‌పల్లి నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2908. ఇందులో పురుషులు 1428, మహిళలు 1480. గృహాల సంఖ్య 489. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3427. ఇందులో పురుషులు 1707, మహిళలు 1720. గృహాల సంఖ్య 650. అక్షరాస్యత శాతం 27.37%. గ్రామ కోడ్ సంఖ్య 575018. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా శ్రీనివాస్ ఎన్నికైనాడు. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శేఖరప్ప విజయం సాధించాడు. మొత్తం పోలైన ఓట్లు 2530 కాగా, శేఖరప్పకు 75 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి లాలప్పకు 520 ఓట్లు, సిపీఐ(ఎం) అభ్యర్థి వెంకటప్పకు 335 ఓట్లు, భాజపా అభ్యర్థి బి.శివానంద్‌కు 215 ఓట్లు లభించాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి