16, డిసెంబర్ 2013, సోమవారం

బోడజానంపేట్ (Bodajanampet)

బోడజానంపేట్ గ్రామము
గ్రామముబోడజానంపేట్ 
మండలముబాలానగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1130 (2001)
1280 (2011)
బోడజానంపేట్ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1280. ఇక్కడి ప్రధాన పంట మొక్కజొన్న. గ్రామంలో పురాతనమైన బురుజు ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1130. ఇందులో పురుషులు 566, మహిళలు 564.గృహాల సంఖ్య 222.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1280. ఇందులో పురుషులు 661, మహిళలు 619. గృహాల సంఖ్య 314. అక్షరాస్యత శాతం 45.63%. గ్రామ కోడ్ సంఖ్య 575122.

రాజకీయాలు:
  • 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఠాకూర్ రాజేందర్ ఎన్నికయ్యారు.
  • 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలూనాయక్ తన సమీప ప్రత్యర్థి, తెరాసకు చెందిన యాదగిరిపై 73 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

గ్రామపాలన:
గ్రామపు పాలన గ్రామపంచాయతీచే నిర్వహించబడుతుంది. గ్రామపంచాయతీ నిధుల ద్వారా వీధిదీపముల ఏర్పాటు, పారిశుద్ధ్యం, నీటిసరఫరా తదితర పనులు జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి వచ్చు నిధులు, బీఆర్‌జిఎఫ్ మరియు ఇతర నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతున్నారు. 

ప్రారంభంలో కేతిరెడ్డిపల్లి పంచాయతి పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని 1981లో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటుచేశారు. జి.జగన్నాథ్ రెడ్డి తొలి సర్పంచిగా వ్యవహరించగా, ఆ తర్వాత గోప్యా, రూప్లాలు సర్పంచిలుగా ఎన్నికైనారు. 2001లో మిలటరీ అధికారిగా పనిచేసిన బి.ప్రతాప్, 2006లో సంధ్యారాణి, 2013లో రాజేందర్‌లు సర్పంచులుగా ఎన్నికైనారు.

(ఈ గ్రామ సమాచారం అభివృద్ధికి సహకరించిన మాజీ సర్పంచి బి.ప్రతాప్ మరియు ప్రస్తుత సర్పంచి రాజేందర్ గారికి కృతజ్ఞతలు)

విభాగాలు: బాలానగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి