8, డిసెంబర్ 2013, ఆదివారం

ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam)

 ధర్మవరపు సుబ్రహ్మణ్యం
జననంసెప్టెంబరు 20, 1954
స్వస్థలంకొమ్మినేనివారి పాలెం (ప్రకాశం జిల్లా)
రంగంటివి మరియు సినిమా హాస్యనటుడు
మరణం2013, డిసెంబరు 7
ధర్మవరపు సుబ్రహ్మణ్యం సెప్టెంబరు 20, 1954న  ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలం  కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యను అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలోనూ చదివారు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్యమండలి తో పరిచయం ఏర్పడింది.

టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించి, తెలుగు సినిమా హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందారు. దూరదర్శన్‌లో ప్రసారమైన "ఆనందోబ్రహ్మ" ద్వారా మంచి గుర్తింపు పొందారు. "తోకలేనిపిట్ట" సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. 1989 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. 2004 నుండి మరణించే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగినారు. 2013, డిసెంబరు 7న మరణించారు.



విభాగాలు: ప్రకాశం జిల్లా ప్రముఖులు, బల్లికురవ మండలము, 1954లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి