బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించారు. 1955లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు. చిత్రకళలోనే కాకుండా సినిమా దర్శకుడిగానూ రాణించారు. ఆగస్టు 31, 2014న బాపు చెన్నైలో మరణించారు.
చిత్రకళ: 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి. ముళ్ళపూడీ వెంకట రమణ రచించిన బుడుగు పుస్తకానికి బాపు బొమ్మలు గీశారు. సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల పుస్తకానికి 101 బొమ్మలు వేశారు. సినిమా దర్శకుడిగా: 1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. ఆయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు. ముళ్ళపూడి వెంకట రమణతో కలిసి పలు సినిమాలాకు కథలు వ్రాశారు. పురస్కారాలు:
= = = = =
| |||||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి