2, డిసెంబర్ 2013, సోమవారం

గడప (Gadapa)

 గడప గ్రామము
గ్రామముగడప 
మండలముదామరగిద్ద
జిల్లానారాయణపేట
జనాభాxxxx (2011)
గడప నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

గ్రామ నామం:
గడప, గదప లేదా (గత్ప) గ్రామానికి ఆ వూరిలో వెలసిన ఘాత నాథుడి గా పిలువ బడే శివుడి పేరొచ్చింది. కర్ణాటక వాడుక భాష లో 'అప్పా' అంటే తండ్రి అని అర్థం. కర్ణాటక శివారు లో ఉన్న ఈ ఘాత నాతుడు కాస్తా ఘాతప్ప గా పిలువబడినాడు. ఈ ఘాతప్ప నేడు గడప గా వ్యవహరం లో ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1106. ఇందులో పురుషులు 558, మహిళలు 548. గృహాల సంఖ్య 198.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1105. ఇందులో పురుషులు 535, మహిళలు 570. గృహాల సంఖ్య 216. అక్షరాస్యత శాతం 44.25%. గ్రామ కోడ్ సంఖ్య 574995.

రాజకీయాలు:
2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా వెంకటమ్మ ఎన్నికైనారు.

విద్యాసంస్థలు:

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, రెండు అంగన్ వాడి కేంద్రాలున్నాయి.



విభాగాలు: దామరగిద్ద మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి