20, డిసెంబర్ 2013, శుక్రవారం

హాజిపల్లి (Hajipally)

 హాజిపల్లి గ్రామము
గ్రామముహాజిపల్లి 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా772 (2001)
795 (2011)
హాజిపల్లి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.ఇది పంచాయతి కేంద్రము. ఉత్తమ గ్రామపంచాయతీగా పలు అవార్డులు రావడంతో గ్రామం జాతీయ స్థాయిలో పేరుపొందినది. ఈ గ్రామపంచాయతి రాష్ట్రపతిచే నిర్మల్ అవార్డు కూడా పొందినది. 2001-06 కాలంలో సర్పంచిగా పనిచేసిన సింగారం శ్రీనివాస్ 2006-11 కాలంలో సర్పంచిగా పనిచేసిన జంగమ్మల కృషికారణంగా గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 772. ఇందులో పురుషులు 383, మహిళలు 389. గృహాల సంఖ్య 177.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 795. ఇందులో పురుషులు 390, మహిళలు 405. గృహాల సంఖ్య 188. అక్షరాస్యత శాతం 56.73%. గ్రామ కోడ్ సంఖ్య 575191

విద్యాసంస్థలు:
ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి