జూపల్లి మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. జూపల్లి గ్రామ పరిధిలో గొందగగట్టు గుట్ట అంచున ఉన్న ఓ గుహలో మధ్యరాతియుగానికి చెందిన ఆనవాళ్ళను మార్చి 2015లో కనుగొన్నారు.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3412. ఇందులో పురుషులు 1753, మహిళలు 1659. గృహాల సంఖ్య 717. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3664. ఇందులో పురుషులు 1862, మహిళలు 1802. గృహాల సంఖ్య 886. అక్షరాస్యత శాతం 39.00%. గ్రామ కోడ్ సంఖ్య 575327. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా చందూలాల్ ఎన్నికయ్యారు.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి