20, డిసెంబర్ 2013, శుక్రవారం

కమ్మదనం (Kammadanam)

 కమ్మదనం గ్రామము
గ్రామముకమ్మదనం 
మండలముషాద్‌నగర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2021 (2001)
1782 (2011)
కమ్మదనం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్  మండలమునకు చెందిన గ్రామము.ఇక్కడ వనసంరక్షణ సమితి ఉంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2021. ఇందులో పురుషులు 847, మహిళలు 1174. గృహాల సంఖ్య 355.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1782. ఇందులో పురుషులు 903, మహిళలు 879. గృహాల సంఖ్య 442. అక్షరాస్యత శాతం 51.85%. గ్రామ కోడ్ సంఖ్య 575203.

విద్యా సంస్థలు:
ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నవి.

అటవీ క్షేత్రం:
ఈ గ్రామం ప్రకృతి రమణియంగా అటవీ ప్రాంతంలో విస్తరించి ఉంది. సుమారు 824 ఎకరాలలో విస్తరించి వున్న ఈ అటవీ ప్రాంతంలో పలు రకాల ఔషదాల మొక్కలు , పలు రకాల జంతువులున్నాయి. 2000లో అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్ సన్ తో పాటు అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కమ్మందనం అటవీ క్ష్రేత్రాన్ని సందర్శించారు.


విభాగాలు: షాద్‌నగర్ మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి