చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన కాపు రాజయ్య 7 ఏప్రిల్, 1925న మెదక్ జిల్లా సిద్ధిపేటలో జన్మించారు. హైదరాబాదులోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లోమా పొందారు.ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు. 20 ఆగష్టు, 2012న మరణించారు.
చిత్రకళ: చిత్రకళలో జాతీయ స్థాయిలో పేరుపొందిన రాజయ్య చిత్రాలు చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. నిరుపేద కుటుంబంలో పుట్టి కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. రాజయ్యకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు. అవార్డులు
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి