18, డిసెంబర్ 2013, బుధవారం

ఎం.వి.మైసూరా రెడ్డి (M.V.Mysura Reddy)

 ఎం.వి.మైసూరా రెడ్డి
జననంఫిబ్రవరి 28, 1949
స్వస్థలంనిడిజువ్వి (కడప జిల్లా)
రంగంరాజకీయాలు
పదవులురాష్ట్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు,
కడప జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన ఎం.వి.మైసూరా రెడ్డి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వి గ్రామంలో 1949 ఫిబ్రవరి 28న జన్మించారు. కాంగ్రెస్పార్టీలో సుధీర్ఘకాలం పాటు కొనసాగి రాష్ట్ర హోంమంత్రిగానూ, రవాణాశాఖ మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యులుగా ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం:
మైసూరారెడ్డి1981 లో రాజకీయాలలోకి ప్రవేశించారు. అంతకు క్రితం వైద్యవృత్తిలో ఉండేవారు. పంచాయితీ ఎన్నికలలో కమలాపురం సమితి అధ్యక్షులుగా గెలుపొందారు. తర్వాత శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ పిదప కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో 25 సంవత్సరాలు కొనసాగారు. 1983 శాసనసభ ఎన్నికలలో ఓటామిపాలై 1985 మరియు 1989 లలో విజయం సాధించారు. 1994లో ఓడిపోయిననూ మళ్ళీ 1999 ఎన్నికలలో విజయం సాధించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోం మంత్రిగానూ, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో రవాణామంత్రిగానూ పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ కు ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన మూడు లోకసభ ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బయటికివచ్చి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.



విభాగాలు: కడప జిల్లా ప్రముఖులు, ఎర్రగుంట్లమండలం, 8వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ మంత్రులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి