నేరెళ్ళపల్లి మహబూబ్‌నగర్ జిల్లా
బాలానగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3103. ఈ గ్రామం గుండేడ్ నుంచి 2 కిమీ దూరంలో ఉంది. గ్రామ పిన్‌కోడ్ సంఖ్య 509202.
జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2695. ఇందులో పురుషులు 1378, మహిళలు 1317. గృహాల సంఖ్య 550.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 3103. ఇందులో పురుషులు 1628, మహిళలు 1475. గృహాల సంఖ్య 719. అక్షరాస్యత శాతం 36.16%. గ్రామ కోడ్ సంఖ్య 575107.
విద్యాసంస్థలు:
గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల 2008లో స్థాపించబడింది.
రాజకీయాలు:
- ఈ గ్రామము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గము, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
- 2006 ఆగస్టులో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గణేష్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
- 2013, జూలై 27న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రాములునాయక్ ఎన్నికయ్యారు.
- 2014లో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో ఇండిపెండెంటుగా పోటీచేసిన లింగూనాయక్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖలీల్‌పై 358 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
 |
(తేది 01-05-2014 నాడు ఈనాడు దినపత్రిక మెయిన్ పేజీలో వచ్చిన ఫోటో)
30-04-2014 నాటి అసెంబ్లీ మరియు లోకసభ ఎన్నికల ఓటింగ్ చిత్రం -
ఇదే పోలింగ్ స్టేషన్‌లో ఈ బ్లాగు రచయిత ప్రిసైండింగ్ అధికారిగా వ్యవహరించారు. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి