పోలెపల్లి నారాయణపేట జిల్లా కోస్గి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇది ఏటా జరిగే ఎల్లమ్మ ఉత్సవాలకు ప్రసిద్ధిచెందినది. 1970లో ఎల్లమ్మ దేవాలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చింది. జాతరలో సిడిఘట్టం ప్రత్యేకతను సంతరించుకుంది. గ్రామ పరిధిలో అంకెన్‌కుంట చెరువు, ఎద్దులకుంట చెరువులున్నాయి. 2011 ప్రకారం గ్రామ జనాభా 2761.
అక్టోబరు 11, 2016న ఈ గ్రామం బొంరాస్‌పేట్ మండలం నుంచి కోస్గి మండలంలోకి చేర్చబడింది. ఫిబ్రవరి 17, 2019న ఈ గ్రామం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలోకి మారింది. జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2355. ఇందులో పురుషులు 1168, మహిళలు 1187. గృహాలసంఖ్య 449. 2011 ప్రకారం గ్రామ జనాభా 2761. ఇందులో పురుషులు 1347, మహిళలు 1414, గృహాల సంఖ్య 565. అక్షరాస్యత శాతం 41.40%. గ్రామ కోడ్ సంఖ్య 574944. రాజకీయాలు: 2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఎరుకల బస్సమ్మ ఎన్నికయ్యారు. నీటిపారుదల: గ్రామ పరిధిలో 97 ఎకరాల ఆయకట్టు ఉన్న అంకెన్‌కుంట చెరువు, 25 ఎకరాల ఆయకట్టు ఉన్న ఎద్దులకుంట చెరువులున్నాయి. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్దరణకు ప్రభుత్వ అనుమతి లభించింది.
= = = = =
| |||||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి