సజ్‌నాపూర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1767. ఇందులో పురుషులు 872, మహిళలు 895. గృహాల సంఖ్య 305. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1968. ఇందులో పురుషులు 960, మహిళలు 1008. గృహాల సంఖ్య 346. అక్షరాస్యత శాతం 29.78%. గ్రామ కోడ్ సంఖ్య 575015. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా మణీల ఎన్నికైనది. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మమ్మ విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్లు 1608 కాగా లక్ష్మమ్మకు 985 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నర్సమ్మకు 519 ఓట్లు లభించాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి