తిమ్మాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇది హైదరాబాదుకు సమీపంలో ఉంది. గ్రామానికి రైలు సదుపాయము కూడా ఉంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3287. ఇందులో పురుషులు 1721, మహిళలు 1566. గృహాల సంఖ్య 792. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3445. ఇందులో పురుషులు 1789, మహిళలు 1656. గృహాల సంఖ్య 826. అక్షరాస్యత శాతం 64.44%. గ్రామ కోడ్ సంఖ్య 575217. 2009 సర్పంచి ఎన్నికలు: 2009 అక్టోబరులో జరిగిన సర్పంచి ఎన్నికలలో డోలి విజయలక్ష్మి విజయం సాధించారు. 9గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉండగా డోలి విజయలక్ష్మి 17 ఓట్ల ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి చింతకింది చంద్రకళపై గెలుపొందారు. మొత్తం 1565 ఓట్లలో 1494 ఓట్లు పోలయ్యాయి. విజయలక్ష్మికి 358, చంద్రకళకు 341 ఓట్లు వచ్చాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి