విఠలాపూర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1968. ఇందులో పురుషులు 987, మహిళలు 981. గృహాల సంఖ్య 355. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2424. ఇందులో పురుషులు 1163, మహిళలు 1261. గృహాల సంఖ్య 466. అక్షరాస్యత శాతం 32.63%. గ్రామ కోడ్ సంఖ్య 574996. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా వనజ దామోదర్ రెడ్డి ఎన్నికైనది. విద్యాసంస్థలు: జిల్లా పరిషత్తి ఉన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఉన్నది. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొత్ల వనజ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి సైదులమ్మపై విజయం సాధించింది. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 1589 కాగా వనజకు 1034 ఓట్లు రాగా, సైదులమ్మకు 467 ఓట్లు వచ్చాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి