వత్తుగుండ్ల నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ గ్రామం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.
జనాభా: 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2420. ఇందులో పురుషులు 1237, మహిళలు 1183. గృహాల సంఖ్య 386. 2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2858. ఇందులో పురుషులు 1469, మహిళలు 1389. గృహాల సంఖ్య 535. అక్షరాస్యత శాతం 33.10%. గ్రామ కోడ్ సంఖ్య 575020. రాజకీయాలు: 2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా వెంకటమ్మ ఎన్నికైనది. విద్యాసంస్థలు: గ్రామంలో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది. ఎంపిటీసి నియోజకవర్గం: మండలంలోని 14 ఎంపిటీసి నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2006 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి సిపీఐ(ఎం) అభ్యర్థి అంజిలయ్య విజయం సాధించాడు. మొత్తం పోలైన ఓట్లు 1866 కాగా అంజిలయ్యకు 860 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లమ్మకు 796 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి వేమారెడ్డికి 47 ఓట్లు వచ్చాయి.
= = = = =
| |||||||||||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి