డెన్మార్క్ యూరప్ ఖండానికి చెందిన దేశము. స్కాండివేనియన్ దేశాలలో దక్షిణాన ఉన్న ఈ దేశం స్వీడన్, నార్వే, జర్మనీ సరిహద్దులను కలిగియుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఫారో మరియు గ్రీన్‌లాండ్ దీవులపై కూడా ఈ దేశానికి హక్కులున్నాయి. 443 దీవులతో కలిపి ఈ దేశ వైశాల్యం 42,924 చకిమీ మరియు ఫారో, గ్రీన్‌లాండ్ ద్వీపాలను కలిపి మొత్తం వైశాల్యం 2,210,579 చకిమీ. జనాభా 57,81,190. డానిష్ అధికార భాష కలిగియున్న ఈ దేశానికి రాజధాని కోపెన్‌హాగెన్. కరెన్సీ డానిష్ క్రోన్.
భౌగోళికం: గ్రీన్‌లాండ్, ఫారో దీవులు కాకుండా 16,577 చకిమీ వైశాల్యంతో డెన్మార్క్ ప్రపంచంలో 130వ పెద్ద దేశంగా ఉంది. జుట్‌లాండ్ మరియు 443 ప్రధాన ద్వీపాలు కల్గియున్న ఈ దేశం ఉత్తర యూరప్ ఖండానికి చెందినది. బాల్టిక్ సముద్రం, నార్త్ సీ తూర్పు పశ్చిమ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన జర్మనీ దేశం సరిహద్దును కలిగిఉంది. 4 పట్టణాలు లక్షకుపైగా జనాభాను కలిగియున్నాయి. చరిత్ర: డెన్మార్క్ చరిత్ర చాలా పురాతనమైనది. క్రీ.పూ.10000 నాటికే మానవులు నివసించినట్లుగా, క్రీ.పూ.4000 నాటికి వ్యవసాయం జరిగినట్లుగా చరిత్ర పరిశోధకులు నిర్థారించారు. క్రీ.శ.8-10 శతాబ్దాలలో బలమైన నావికాదళం కలిగిన దేశంగా ఖ్యాతిచెందింది. ఆధునిక కాలంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారత్, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలపై ఆధిపత్యం సాధించారు.1830లో జాతీయోద్యమం ద్వారా 1849లో రాచరిక రాజ్యాంగం ఏర్పడింది. 1850 తర్వాత పారిశ్రామికీకరణ వల్ల రైలు, రోడ్డు మార్గాలు ఏర్పడి పాడిపరిశ్రమ, మాంసం ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో డెన్మార్క్‌పై జర్మనీ దాడిచేసి లొంగదీసుకుంది. 1944లో స్వతంత్ర రిపబ్లిక్‌గా అవతరించింది. క్రీడలు: డెన్మార్క్ జాతీయ క్రీడ ఫుట్‌బాల్. 1992లో యూరోపియన్ చాంపియన్‌గా విజయం సాధించింది. టెన్నిస్ క్రీడాకారిణి కరోలిన్ ఒజ్నియాకి మహిళల విభాగంగా నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 2 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలు సాధించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
| |||||||||||

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి