19, జులై 2018, గురువారం

వలిగొండ మండలం (Valigonda Mandal)

వలిగొండ మండలం
జిల్లా యాదాద్రి భువనగిరి
రెవెన్యూ డివిజన్ చౌటుప్పల్
అసెంబ్లీ నియోజకవర్గంభువనగిరి
లోకసభ నియోజకవర్గంభువనగిరి
వలిగొండ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2012 జూన్ లో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, ప్రముఖ చరిత్రకారుడు బీ.ఎన్.శాస్త్రి ఈ మండలానికి చెందినవారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన మోటకొండూరు మండలం, ఈశాన్యాన ఆత్మకూరు (ఎం) మండలం, తూర్పున మోత్కూరు మండలం, దక్షిణాన రామన్నపేట మండలం, నైరుతిన చౌటుప్పల్ మండలం, పశ్చిమాన భూదాన్ పోచంపల్లి మండలం, వాయువ్యాన భువనగిరి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 53010, 2011 నాటికి జనాభా 55913. ఇందులో పురుషులు 28508, మహిళలు 27405.

రాజకీయాలు:
ఈ మండలము భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Arruru, Chittapur, Duppally, Edullagudem, Gangapur-P-Arrur, Gokaram, Golne Palle, Goparaj Palle, Gurnadha Palle, Kanchanpally, Kashamma Kunta, Kerchipalli, Lingarajpally, Lothukunta, M.Turkapally, Malle Palle, Mandapur, Mogilipaka, Muddapur, Nagaram, Narsapuram, Nathallagudem, Nemili Kalva, Pahilwanpur, Poddutur, Pulgilla, Redla Repaka, Sangam, Sunkishala, Tekula Somaram, Valigonda, Velverthy, Vemulakonda, Venkatapur, Verkat Palle

ప్రముఖ గ్రామాలు
నెమిలికాల్వ (Nemilikalva):
2012 జూన్ లో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఈ గ్రామానికి చెందినవారు. ఈశ్వరయ్య భార్య శ్యామలాదేవి తెదేపా తరఫున వలిగొండ జడ్పీటీసిగా పనిచేశారు. సోదరుడు బాలనర్సయ్యగౌడ్ 2006లో ఎన్నికై 2010లో ఆత్మహత్య చేసుకొనే వరకు వలిగొండ మండలా అధ్యక్షినిగా ఉన్నారు. మరో సొదరుడు 2006లో నెమలికాల్వ నుంచి తెదేపా తరఫున ఎంపీటీసిగా గెలుపొందారు. ఈశ్వరయ్య పెద్దనాన్న కుమారుడు స్వామిగౌడ్ 2004లో మిర్యాలగూడ నుంచి తెదేపా తరఫున లోకసభకు పోటీచేసి ఓడిపోయారు.

ఇవి కూడా చూడండి:

ఫోటో గ్యాలరీ
c
c
c c


విభాగాలు: యాదాద్రి భువనగిరి జిల్లా మండలాలు,  వలిగొండ మండలము, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Nalgonda Dist, 2012,
  • Handbook of Census Statistics, Nalgonda District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 247 తేది: 11-10-2016 
  • నల్గొండ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర


Valigonda Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి